మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గురువారం రాత్రి విశాఖ కేజీహెచ్ లోని ఏఏంసి మెడికల్ ఉమెన్స్ హాస్టల్ ను ఆమె సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన వివిధ సంఘటనలో కేవలం 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. వైసిపి చేస్తున్న ఆరోపణలు నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.