ప్రముఖ నాటక రచయిత, రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు ఎ. వి. వి. ఎస్. మూర్తి (బాదంగీర్ సాయి) గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. విశాఖలో నివాసముండే ఆయన కొంతకాలంగా బ్రెయిన్ హ్యామెరెజ్ సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మురళీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.