HYD: చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదని చెప్పారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.