వాట్సాప్ గ్రూప్ సలహాలతో ఇంట్లోనే భార్యకు డెలివరీ చేసిన భర్త

62பார்த்தது
వాట్సాప్ గ్రూప్ సలహాలతో ఇంట్లోనే భార్యకు డెలివరీ చేసిన భర్త
వాట్సాప్ గ్రూప్ సలహాలతో ఇంట్లోనే భార్యకు డెలివరీ చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కుండ్రత్తూరు సమీపంలో మనోహరన్(36), అతని భార్య సుకన్య(32) నివాసం ఉంటున్నారు. గర్భవతి అయిన సుకన్యకు ఈ నెల 17న పురిటి నొప్పులు రాగా, ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ఓ వాట్సప్ గ్రూప్ సభ్యుల సలహాల మేరకు ఇంట్లోనే భార్యకు పురుడు పోశాడు. ఇది కాస్తా పోలీసులకు చేరడంతో.. మనోహరన్‎పై కేసు నమోదు చేశారు. పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி