విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని చావులమదుం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన మద్యం షాపు తక్షణం మూసివేయాలని శనివారం రాత్రి మహిళలు, స్థానికులు ఆందోళన నిర్వహించారు. వైన్ షాప్ మాకొద్దూ అంటూ నినాదాలు చేశారు. వైన్ షాప్ ముందు మహిళలు బైఠాయించారు. జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేస్తే మా ప్రాంతంలో మందుబాబులతో ఇబ్బందులు తలెత్తుతాయని, తక్షణం మూసివేయాలని డిమాండ్ చేశారు.