ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ బృందం పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది. ఈ మేరకు తిరుపతి, తిరుమలలో సిట్ బృందం పర్యటించనుంది. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం సీబీఐ డైరెక్టర్‌కు సిట్ బృందం నివేదిక ఇవ్వనుంది.