జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అధ్వర్యంలో ఈనెల 25న రవీంద్రభారతిలో జరిగే బీసీల సమర భేరిని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం బషీర్ బాగ్ లో జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య, తంగెళ్ళమూడి నంద గోపాల్ తో కలిసి ఆయన మాట్లాడారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టీ చట్ట సభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.