స్వలాభం కోసమే మాజీ ముఖ్యమంత్రి జగన్ పై వాసిరెడ్డి పద్మ విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ కార్యకర్తలను సరిగా చూసుకోకపోతే మహిళ చైర్మన్ పదవి ఆమెకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వాతంతోనే వాసిరెడ్డి పద్మ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాజకీయం కోసం ఆత్మవంచన చేసుకోకూడదని సూచించారు.