వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా రెండో సారి నియమితులైన రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డికి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్ పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.