వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులైన విజయసాయిరెడ్డితో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రానుందని విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం, జీవీఎంసీ ఎన్నికల్లో విజయ సాయి రెడ్డి కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. మూడు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు.