నక్కపల్లి మండలంలోని సోమవారం పర్యటించిన రాష్ట్ర హోం మంత్రి అనితని చందనాడ ఐటిడిపి గ్రామ అధ్యక్షుడు పుణ్యమంతుల రాజు హోం మంత్రి అనితని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు స్పందించిన హోం మంత్రి అనిత చందనాడ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.