చోడవరం పంచాయతీలో పాత చెరువుని గ్రావేల్ మట్టి తో కప్పివేయడం వలనచోడవరం లోతట్టు ప్రాంతాలలో, ద్వారకనగర్, రెల్లి వీధి, కోపరేటివ్ కాలనీ, బాలాజీ నగర్, గుణశెట్టివారి వీధి, కోటవీధి, గండి కాలనీ ప్రాంతాలలో, ఈ మధ్య కాలంలో కురుస్తున్న వర్షాలకు జలమయం అయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు చెప్పారు. మంగళవారం పాత చెరువు వద్ద ఆయన మాట్లాడుతూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బేకాతర్ చేశారన్నారు.