బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆమె టెలికానిఫెన్స్ ద్వారా రానున్న ముప్పుపై అధికారులతో చర్చించారు. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసారు.