సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకీ వస్తుందనీ, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి, ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందనీ అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటీ, ధనధాన్యాలతోటీ, సుఖశాంతులతోటీ నింపుతుందని విశ్వసిస్తారు. ముగ్గులని చుక్కలు పెట్టి వేశారు. చుక్కలు లేకుండా అలాగే ఆర్ట్ గా కూడా వేశారు. చుక్కలు పెట్టి వేసిన ముగ్గు బాగా పెర్ఫెక్ట్ గా వస్తుందంటారు కానీ బాగా చేయి తిరిగిన వారు ఏ ముగ్గునైనా చిటికెలో పెట్టేయగలరు. చుక్కల ముగ్గులో చుక్కలని కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గులో చుక్కల మధ్యలో నుండి గీతలు గీస్తూ ముగ్గు వేశారు. ఈ ముగ్గులు పూలు, ఆకులు లతలు వంటి డిజైన్స్ తో సందర్భానుసారంగా వేసిన ముగ్గు కనువిందు చేసింది. భోగి రోజు వేసే ముగ్గులో పొంగలి, చెరుకు గడలు దీపాలతో ముగ్గు అలంకరించారు.