తుని మండలం రాపాక గ్రామంలో శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షతన మండల బిజెపి అధ్యక్షులు ఆధ్యాత్మికవేత్త కర్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. దినసరి కూలీలకు వృద్ధులకు, కూరగాయలు పంపిణీ కార్యక్రమం కొనసాగించారు. ఈ గ్రామంలో సుమారు150 కుటుంబాలకు రెండో రోజు ఆరు రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నూతనంగా నిర్మించబడుతున్న శ్రీ రామ్ చంద్ర మిషన్ వద్ద ఆశ్రమ సభ్యులతో.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కర్రీ శ్రీనివాస్ సేవా కార్యక్రమం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.