పార్వతీపురం మండలం గోపాలపురంలో కొద్దిరోజుల క్రితం జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజేష్ అనే యువకుడిని రూరల్ పోలీస్ స్టేషన్ కు గత మంగళవారం రాత్రి విచారణ కు తీసుకొని వచ్చారు. స్టేషన్ నుండి పోలీసులు కన్నుగప్పి కొద్దిసేపటికే పరారయ్యాడు. అయితే అదే యువకుడు బుధవారం ఉదయం బెలగాం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై శవమై కనిపించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.