వరద బాధితుల సహాయార్థం సాలూరు ప్రాణదాత ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ వి. గణేశ్వరరావు, సభ్యులు ఇండుపూరి నారాయణరావు, షణ్ముఖ ముత్యాలు, గంటా వెంకటరాజులు ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును బుధవారం సీఎం చంద్రబాబుకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్బంగా మన్యం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మండల, గ్రామస్థాయి అధికారుల కొరత ఉందని మంత్రి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, విజయచంద్ర, జగదీశ్వరి ముఖ్యమంత్రికి తెలియజేశారు.