విద్యుత్ షాక్ తో ముక్కుపచ్చలారని ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన కొమరాడ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. కూనేరులోని ఓ చర్చిలో ఎలుకలు ప్రవేశించి వస్తువులు పాడు చేస్తున్నాయని కడ్రక కృష్ణ అనే వ్యక్తి చర్చి చుట్టూ ఇనుప కంచె వేసి విద్యుత్తు ఎర్త్ పెట్టాడు. విషయం తెలియని జిన్నాన అనేష్ (4) ఆడుకుంటూ కరెంట్ వైర్లను తాకడంతో షాక్ కు గురై అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.