నెల్లిమర్ల పట్టణంలోని మద్యం గోడౌన్ వద్ద శుక్రవారం సందడి వాతావరణం నెలకొంది. మద్యం స్టాక్ కోసం వాహనాలు పెద్ద ఎత్తున అక్కడకు క్యూ కట్టాయి. మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో దుకాణాదారులు భారీగా మద్యం నిల్వలను సమకూర్చుకునేందుకు మద్యం గోదాముల వద్దకు వాహనాలతో తరలివస్తున్నారు. అదేవిధంగా గోదాముకు సరుకు తీసుకొచ్చే వాహనాలు కూడా అక్కడికి రావడంతో ఆ ప్రాంతం రద్దీగా మారుతోంది.