గిరిజన చట్టాలను పగడ్బందీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి. ఇందిర డిమాండ్ చేశారు. కురుపాం మండలంలోని పెదశాఖలో బిడ్డిక మధు అధ్యక్షతన మంగళవారం సిపిఎం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఇందిర ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.