కురుపాం: శిక్షణ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి ఆర్ఎటీఐలో ఫ్యాబ్రికేటర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం ప్రిన్సిపల్ సునీల్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7981308986 నంబర్ ను సంప్రదించాలన్నారు.