గంట్యాడ ఎమ్మార్వో కార్యాలయంలో సిఎస్ డిటి ఎన్వీవీఎస్ మూర్తి రైస్ మిల్లర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. 2024-25 ధాన్యం సేకరణపై మిల్లర్లకు పలు సూచనలు చేశారు. ధాన్యం సేకరణ కోసం గన్ని బ్యాగులు మిల్లర్లు ఒకసారి వాడినవి వినియోగించవచ్చని తెలిపారు. అదేవిధంగా పిఎసిఎస్ కేంద్రాలలో గన్ని బ్యాగులు అందజేయడం జరుగుతుందని అన్నారు. మిల్లర్లు నవంబరు 10వ తేదీ లోగా బ్యాంక్ గ్యారంటీలు చెల్లించాలని కోరారు.