నాయుడుపేట మండల పరిధి మల్లం కూడలి వద్ద టీ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న 33 మద్యం బాటిళ్లను అర్బన్ సీఐ బాబీ, స్థానిక ఎస్ఐ స్వాధీనం చేసుకున్నమన్నారు. పట్టణంలో సీఐ మాట్లాడుతూ.. విన్నమాలకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా టీ దుకాణంలో మద్యం విక్రయాలు సాగిస్తున్నారని సమాచారం రావడంతో తనిఖీ చేపట్టామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.