విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ కేవీబీ పురం మండలాధ్యక్షుడు రామాంజులు నాయుడు అన్నారు. శుక్రవారం అంజూరు ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రవి కుమార్, అధికారులతో కలసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. హెచ్ఎం మురళి, తదితరులు పాల్గొన్నారు.