నెల్లూరు మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా. ఏసుదాసు
నెల్లూరు మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా గూడూర్ నందు మెకానికల్ హెచ్ఓడి గా పనిచేస్తున్న ఏసుదాసును పదోన్నతిపై నియమించారు. బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.