కావలి: క్రిస్మస్ సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కావలి నియోజకవర్గం బోగోలులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులతో కలిసి ఆయన క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. అలాగే పేద ప్రజలు మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏసుక్రీస్తు సూచించిన నీతి, నిజాయితీ మార్గంలోనే ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆయన కోరారు.