ఏపీలోని ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల ఆస్తులు కాజేయాలని గతంలో మాజీ సీఎం జగన్ కుట్ర చేశారని మంత్రి నిమ్మల రామునాయుడు ఆరోపించారు. శుక్రవారం నరసాపురం వై.ఎన్. కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి నిమ్మల పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించడంతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి అన్నారు. డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.