వేళాంగణి మాత జన్మదిన వేడుకలు విజయవంతం చేయండి: బిషప్

74பார்த்தது
వేళాంగణి మాత జన్మదిన వేడుకలు విజయవంతం చేయండి: బిషప్
కొత్తకోడూరు సముద్ర తీరాన వెలసి ఉన్న వేళాంగణి మాత జన్మదిన మహోత్సవాలను సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నామని వీటిని విజయవంతం చేయాలని బిషప్ ఎండి ప్రకాశం తెలిపారు. నెల్లూరు సెంట్ క్యాడద్రల్ చర్చిలో ఆదివారం మాట్లాడుతూ ప్రతి ఏడాది వేళాంగణి మాతను లక్షలాదిమంది దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులను అందుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ వైడీ హృదయ రాజ్, ఫాదర్ సావిమో, ఫాదర్ పాపారావు, లూయిస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி