వడమాలపేట ఓబీఆర్ కండ్రిగ గ్రామ పంచాయతీలో గురువారం "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.