సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ అధికారిగా ఈతమాకుల కిరణ్మయి యాదవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న భూమి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అలాగే ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. నూతన ఆర్డీఓ ను కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.