చిత్తూరు ప్రశాంత్ నగర్ చెందిన ఆటో డ్రైవర్ సాయి ప్రేమ్, అతని కూతురు అలీజాపై ప్రమాదవశాత్తు వేడి పాలు పడడంతో ఒళ్లంతా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం వేలూరు సిఎంసి నందు ఎమర్జెన్సీ వార్డులో చేర్పించడం జరిగింది. సాయి ప్రేమ్ వృత్తిరీత ఆటో డ్రైవర్. ఆర్థిక పరిస్థితి బాగా లేనందున, దాతలు ద్వారా సమకూర్చాలని కోరడంతో మనం ఫౌండేషన్ వారు సోషియల్ మీడియా ద్వారా దాతలు చేత సమకూర్చిన మొత్తాన్ని 45,000 రూపాయలు చెక్కు వారికి బుధవారం అందజేసారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, మురళి తదితరులు పాల్గొన్నారు.