టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇవ్వనుండగా.. రూ.100తో సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు.