రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాది శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 163 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 58 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి. రామారావు తదితరులు ఉన్నారు.