ఉరవకొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఈనెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు 4 రోజులపాటు నిర్దేశించిన సచివాలయాల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి బి. వి. రవిప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.