విడపనకల్లు మండలం ఉండబండ గ్రామం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటంతో స్థానిక టీడీపీ నేతలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి పంచాయతీ అధికారులతో మాట్లాడి తాత్కాలిక మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.