నార్పల మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎస్ఐ సాగర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణములో పోలీస్ పహారాను ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల, బాలికల పాఠశాల వదిలిన సమయంలో మఫ్టీలో పోలీసులతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్ఐ తెలిపారు.