పుట్టపర్తిలోని వారధి ప్రవేట్ పాఠశాలను మంగళవారం అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు ఆకస్మిక తనిఖీ చేశారు. సెలవు రోజుల్లో పాఠశాలను నిర్వహించడంతో యాజమాన్యంపై మండిపడ్డారు. ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో పాఠశాల నిర్వహించడం దారుణం అన్నారు. దీనిపై ఎంఈఓ కు ఫిర్యాదు చేశామని, పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్ రెడ్డి డిమాండ్ చేశారు.