శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద కదిరి-హిందూపురం రహదారి పై పెద్ద పెద్ద గుంతలు పడడంతో గుంతల్లో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తోంది. శనివారం రహదారిపై వున్న గుంతల్లో వర్షపు నీరు చేరడంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.