ధర్మవరంలో మద్యం షాపుపై దాడి చేయడం హేయమైన చర్య అని బాధితుడు, వైసీపీ నేత బాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. 30 మందిమి షాపులకు టెండర్ వేశామన్నారు. కానీ ఒక్క షాపు మాత్రమే మాకు తగిలిందని తెలిపారు. మంగళవారం రాత్రి రూ. 10 లక్షల సరకు తీసుకురాగా దుండగులు ధ్వంసం చేశారని అన్నారు. రూ. 5లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.