విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గేదె మృతి చెందిన ఘటన వింజమూరు మండలం పరిధిలోని ఏ కిస్తీపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన లక్కు రవికి చెందిన గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందింది. సుమారు రూ. లక్ష విలువ చేసేటువంటి గేదె మృతి చెందడంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని, తమ జీవనాధారం ఆ గేదె అని తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు కోరారు.