వరికుంటపాడు మండలంలోని నక్కల గండి రిజర్వాయర్ 14 అడుగుల మేర నీరు చేరింది. గడచిన మూడు రోజులుగా కురిసిన వర్షాల ప్రభావం వలన భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే దీని సామర్థ్యం 24 అడుగులు ప్రస్తుతం ఈ రిజర్వాయర్ కు ఓ మోస్తారు నీరు చేరడంతో చుట్టుపక్కల గ్రామాలకు భూగర్భ జలాలు పెరిగా అవకాశాలు ఉన్నాయి. నక్కల గండిలో నీరు సమృద్ధిగా ఉంటే చుట్టుపక్కల ప్రాంత రైతులు భారీగా పంట సాగు చేస్తారు.