ఉదయగిరి నియోజకవర్గం లోని 143 పంచాయతీలలో త్రాగునీటి ఎద్దడి నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జలసిరి ద్వారా నియోజకవర్గంలో రైతులకు అత్యధిక బోర్లు వేసేలా ప్రణాళిక చేసుకోవాలన్నారు.