సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాలను అడ్డం పెట్టుకుని అవినీతి పనులు చేస్తున్నారని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. పొదలకూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూరాయపాళెం ఇసుక రీచ్ లో సోమిరెడ్డి 100 కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించామన్నారు.