కడప మున్సిపల్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల సైన్స్ ఎక్స్‌పరిమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకుంది. వృద్ధులు, పక్షవాతం, అంగవైకల్యంతో బాధపడేవారి సౌకర్యార్థం దీనిని స్టూడెంట్స్ రూపకల్పన చేశారు. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ దాటడానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విద్యార్థులు ఈ ఆలోచన చేశారు. ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన కలిగినందుకు వారిని పవన్ ప్రత్యేకంగా అభినందించారు.