ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో పాఠశాలల స్థలాలు కబ్జా చేసే వారిపై గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లాలో పాఠశాలల్లో ఆక్రమణలపై ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్కూల్స్‌కి ధీటుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్ధులు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పవన్ అన్నారు.