నెల్లూరు: విఎంఆర్ నగర్ లో ఉచిత ట్యూషన్ సెంటర్ ప్రారంభం
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్, విఎంఆర్ నగర్ లో బుధవారం జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. విజ్ఞాన కేంద్రం నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్ నగేష్, చలపతి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి, చదువుల్లో వారు రాణించేందుకు ఈ ట్యూషన్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. దీనిని స్థానికులు ఉపయోగించుకోవాలని కోరారు.