ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అఖిలభారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరు పురమందిరంలో వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదమ్ముల్లాగా ఉన్న మాల మాదిగలను వేరు చేసేందుకు కుట్ర పన్నారన్నారు. నేతలు స్వర్ణ వెంకయ్య, విజయ్ కుమార్, గోపాల్, దళిత బాబు, రమణయ్య పాల్గొన్నారు.