నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రద్దు చేయాలన్నారు. సుదూర ప్రాంతాలలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం తగదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అగిరిపల్లి నందు ప్రధానోపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలలో రత్న కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడు మరణించడం జరిగింది అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.