ఎస్సీ కులగణనకు సంబంధించి సోషల్ ఆడిట్ జాబితాలో ఎస్సీ మాదిగకు సంబంధించి వివరాలను నమోదు చేయడంలో తప్పులు జరుగుతున్నాయని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగ నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ తప్పులను వెంటనే సరిదిద్దాలని ఈ మేరకు ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతి పత్రం అందజేశారు. సోషల్ ఆడిట్ తప్పిదాల వల్ల మాదిగలు నష్టపోయే అవకాశం ఉందన్నారు.