పారిశుద్ధ్య కార్మికుల పై దాడిని కౌన్సిలర్ అందే ప్రత్యూష ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఇటీవల బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల పై దాడి జరిగిన విషయం తెలిసిందే.